24 June, 2026 | 2:55 AM

పెద్దలోడి రైతు వేదికలో విత్తన మేళా

24-06-2026 01:52 AM

మునిపల్లి, జూన్ 23: మండలంలోని పెద్దలోని రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమాన్ని ఏవో అనితా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఏడీఏ సత్యనారాయణలు హాజరై మాట్లాడారు. కందులు, పెసర్లు, శనగ, మినుములు, వేరుశెనగ, నువ్వులు తదితర విత్తనాలు విక్రయించడం జరుగుతుందన్నారు.

అలాగే  సాంప్రదాయ ఎరువులతో పాటు, నానో యూరియా, నానో డీఏపీ ఉత్పత్తులు కూడా ఈ వేదికల ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు నిఖిత, మహేష్ ,రెహమాన్, అంజన్న, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులుపాల్గొన్నారు.