నాణ్యమైన విత్తనాలు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రాష్ట్రంలో 2,601 రైతు వేదికల్లో విత్తన మేళాలు ప్రారంభం
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన, ధ్రువీక రించిన విత్తనాలను అం దుబాటులోకి తీసుకువచ్చి అధిక దిగుబడులు సాధించేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమ ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న విత్తన మేళాలను సోమవా రం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మం త్రి తుమ్మల వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతులకు సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ ఉన్న ఏడు సన్న వరి రకాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో సమగ్రంగా చర్చిం చిన అనంతరం ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించిందన్నారు.
రైతులు ఈ రకాల సాగుకు ముందుకు రావాలని, ఈ ఏడు రకాలకే ప్రభుత్వం ప్రత్యేక బోనస్ అందించనున్నట్లు తెలిపారు. వరి విత్తనాలతో పాటు పప్పు జాతులు, నూనెగింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. జూన్ 23 నుంచి 30 వరకు రాష్ట్రంలోని 2,601 రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మేళాల్లో రైతులకు 1,24,649 క్వింటాళ్ల వరి విత్తనాలు, 6,913 క్వింటాళ్ల పప్పు జాతి విత్తనాలు, 11,815 క్వింటాళ్ల నూనెగింజల విత్తనాలు, 1,339 క్వింటాళ్ల కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వెల్ల డించారు. అదనంగా నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను కూడా రైతుల కొనుగోలుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. విత్తనాల విక్రయం తోపాటు వాటి సాగు విధానాలు, పంట యాజమా న్యం, సమగ్ర పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధనకు సంబంధించిన అంశాలపై వ్యవసాయ శా ఖ అధికారులు, వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని ఉత్తమ్‌తెలిపారు.






