calender_icon.png 13 October, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం

13-10-2025 06:33:42 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో సోమవారం ఐకేపీ(IKP) కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం ధర్మసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు సకాలంలో సరైన ధర లభించేలా, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎ వరలక్ష్మి, రజిత, ఎల్లవ్వ, ప్రత్యూష, పద్మ మహిళా సంఘాల సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.