calender_icon.png 13 October, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట రుణాలు ఇవ్వాలి

13-10-2025 06:39:08 PM

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్..

కాటారం (విజయక్రాంతి): అటవీ పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున యూనియన్ బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కి అటవీ పట్టాలు పొందిన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసి రైతులు అటవీ పట్టాలు పొంది ఉన్నప్పటికీ బ్యాంకుల నుండి ఎలాంటి పంట రుణాలు కల్పించకపోవడంతో ఆదివాసి రైతులు చేసిన పంటను రక్షించుకోవడానికి ప్రైవేటు గడ్డి వ్యాపారస్తుల వద్ద, మైక్రో ఫైనాన్స్ వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంట మొత్తం తీసుకున్న అప్పు తీర్చడానికి సరిపోవటం లేదని అదేవిధంగా ఫెర్టిలైజర్స్ షాపులలో ఉద్దెర ఖాతాలు పెట్టి మందులు తీసుకొని మోసపోతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అటవీ పట్టాలకు పంట రుణాలు ఇస్తావుంటే ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవ్వక పోవడం ఈ దుస్థితికి కారణం ఎవరు అని ప్రశ్నించారు అప్పుల ఊబిలో కోరుకుంటున్న రైతులను కాపాడాల్సిన కనీస బాధ్యతను కూడా అధికారులు ఇక్కడి పాలకులకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన పోరాటాలకు పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు దమ్మూర్ మాజీ ఉప సర్పంచ్ మడే సత్యనారాయణ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్ది, శేఖర్, రామినేని రాజబాబు, తోలం బిక్షపతి, మేడే సురేష్, జనగామ ముత్తయ్య తదితరులు ఉన్నారు.