calender_icon.png 1 September, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న టేకు పట్టివేత

31-08-2025 01:12:09 AM

రూ. 8 లక్షల విలువైన కలప స్వాధీనం

 వెంకటాపురం నూగూరు, ఆగస్ట్ 30( విజయ క్రాంతి): చత్తీస్‌ఘడ్ సరిహద్దు నుంచి వెంకటాపురం మీదుగా అక్రమంగా తరలిస్తున్న టేకు దిమ్మల లారీని అటవీశాఖ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ గ్వాలియర్ తన సిబ్బందితో కలిసి చిన్న నేచర్ వాహనంలో ౧౦ దిమ్మలను తరలిస్తుండగా కాపుగాసి మండలంలోని మర్రవానిగూడెం గ్రామ సమీపంలో వాటిని పట్టుకున్నారు.

వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుందని ఎఫ్‌డీఓ గ్వాలియ తెలిపారు. స్మగ్లర్లు చత్తీస్‌ఘడ్ అడవులు లక్షంగా చేసుకొని కలప అక్రమ తరలింపు పాడుతున్నట్లు ఆయన వివరించారు. స్వాధీనం చేసుకున్న టేకు దిమ్మలను స్థానిక అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఇతనికి లో వెంకటాపురం అటువైరేంజి సిబ్బందితో పాటు ట్రాకింగ్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.