20-09-2025 06:31:05 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు సోయం గంగు బాయి, సిడం వైష్ణవి ,ఆత్రం పార్వతి హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న 17వ హెచ్ఎఫ్ఐ మినీ బాల బాలికల హ్యాండ్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుడిమేత జంగు, పాఠశాల పిడి బండ మీనా రెడ్డి తెలిపారు. విద్యార్థినీలను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్న పాఠశాల హ్యాండ్ బాల్ కోచ్ అరవింద్ ను ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, జిల్లా హ్యాండ్ బాల్ ఇంచార్జి ప్రెసిడెంట్ అరిగేలా మల్లికార్జున్ యాదవ్, గిరిజన క్రీడల అధికారి మడావి షేకు, ఏ సి ఎం ఓ ఉద్దవ్, జి సి డి ఓ శకుంతల, ఏ టీ డి ఓ, చిరంజీవి,హెచ్ డబ్ల్యు ఓ సాయి బాబా, కోచ్ లు విద్యసాగర్, తిరుమల్, సాయి, రవి, యాదగిరి, పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.