calender_icon.png 20 September, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైనిజంలోకి కొత్త సభ్యులను ఆహ్వానించండి

20-09-2025 06:31:46 PM

సభ్యులకు కోరిన లైన్స్ క్లబ్ గవర్నర్ మదన్మోహన్ రేపాల 

భద్రాచలం (విజయక్రాంతి): లయన్స్ క్లబ్బుల ద్వారా ప్రజలకు సేవ చేయటానికి యువతను మహిళలను సభ్యులుగా చేయాలని లయన్స్ క్లబ్ గవర్నర్ మదన్ మోహన్ రేపాల కోరారు. భద్రాచలం హరిత హోటల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, డిస్ట్రిక్ట్ 320E ఆధ్వర్యంలో శనివారం సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్ మోహన్ రేపాల ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు మార్గదర్శక సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి కృషి చేస్తాయని, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, అన్ని రంగాలలో మరిన్ని సేవా ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సమావేశంలో రాబోయే కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కమల రాజశేఖర్, కార్యదర్శి సిద్ధారెడ్డి, కోశాధికారి రామారావు,యోగి సూర్యనారాయణ, కురిచేటి శ్రీనివాస్, సిద్దులు, పళ్లింటి దేశప్ప, పరిమి సోమశేఖర్, చావా లక్ష్మి నారాయణ, హరిచంద్ర నాయక్, రామలింగేశ్వరరావు, గాదె మాధవరెడ్డి, వెంకటచారి, బివి రమణారెడ్డి, ఉమాశంకర్ నాయుడు, నరసింహాచారి, పవన్, తదితరులు పాల్గొన్నారు.