calender_icon.png 18 December, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిట్స్ కళాశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

18-12-2025 07:08:54 PM

కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సువార్త చర్చి పాస్టర్ రవి కుమార్ పాల్గొని  విద్యార్థినులకు దైవ సందేశం ఇచ్చారు. ప్రేమకు ప్రతి రూపం యేసు ప్రభువని, అందరు యేసు ప్రభువు సందేశాన్ని పాటించాలని, శాంతి మార్గాన్ని ఆచరించాలన్నారు, ఇతరులపై ప్రేమ, జాలి, కరుణ, చూపించాలని, సోదర భావంతో కలిసి మెలిసి జీవించాలన్నారు, అనంతరం విద్యార్థినులతో కలసి కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, అధ్యాపకులు, నరసింహ రావు, నాగరాజు, లక్ష్మణ్, అరుణ, ఝాన్సీ, సంధ్య, కళ్యాణి, కిరణ్ కుమార్, వెంకట రత్నం, ప్రత్యుష, విద్యార్థినులు పాల్గొన్నారు.