22-12-2025 09:27:03 PM
మునిపల్లి,(విజయక్రాంతి): ఈనెల 25వ తేదీన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సోమవారం రాత్రి మండల కేంద్రమైన మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సిహెచ్ఓ సురేందర్, స్టాఫ్ నర్స్ ప్రియలత, లక్ష్మితో కలిసి డాక్టర్ సంధ్యారాణి కేక్ కట్ చేసి సిబ్బందికి క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ఆస్పత్రిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ సంధ్యారాణి తెలిపారు.