calender_icon.png 23 December, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

క్రీడలతో ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ

22-12-2025 10:16:46 PM

టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ 

వనపర్తి,(విజయక్రాంతి): ఆటలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఐజేయు కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గోపాలపేట రోడ్ లో ఉన్న సెయింట్ థామస్ పాఠశాలలో ఛాంపియన్షిప్ వాలీబాల్ పోటీలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. క్రీడల వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను, శారీరక దృఢత్వాన్ని కలగజేస్తాయని చెప్పారు.

ప్రధానంగా  వాలీబాల్ క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. వనపర్తి విద్యతో పాటు క్రీడలకు  ఎంతో ప్రసిద్ధి చెందిందని ఇక్కడి క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. విద్యార్థులు చదువును కొనసాగిస్తూ ఉన్నతంగా రాణించాలని దీనికి తోడు క్రీడల వల్ల మంచి ఆరోగ్యంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం కల్పిస్తాయని అన్నారు. మొత్తం 15 జట్లు ఈ పోటీల్లో పాల్గొనగా నిర్వాహకులు పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, పలువురు పీఈటీలు ఉమాశంకర్,శేఖర్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాధవరావు,నాయకులు  రవి కాంత్ తదితరులు పాల్గొన్నారు.