calender_icon.png 22 December, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగాయత్ సమాజాభివృద్ధికి నడుంబించాలి

22-12-2025 10:11:38 PM

జిల్లా యువజన, మహిళా కమిటీల ఎన్నిక

అధ్యక్షులు పట్నంశెట్టి వీర సోమయ్య

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వీర శైలి లింగాయత్ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మహిళ, యువజన విభాగం భాగ్యసామ్యం ఎంతో అవసరమని జిల్లా సంఘం అధ్యక్షులు పట్నంశెట్టి వీర సోమయ్య అన్నారు. సోమవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో జిల్లా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా జిల్లా స్థాయి యువజన, మహిళా కమిటీల ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన యువజన కమిటీ అధ్యక్షునిగా ఉప్పు శివకుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉప్పు ఆశిష్, ప్రధాన కార్యదర్శిగా కులగాని సాయి, ఉపాధ్యక్షులుగా ఉప్పు రాకేష్ తిక్క రమేష్, కోశాధికారి గా రాచర్ల సాయి, సంయుక్త కార్యదర్శి మాచ పత్రి మనోజ్,

ప్రధాన కార్యదర్శిగా ఉప్పు మల్లికార్జున్, కార్యవర్గ సభ్యులుగా దుర్గం రాకేష్, ఉప్పు పున్నమి చందర్, ఉప్పు వంశీ, ధార శ్రావణ్, తిక్క శ్రీకర్ లు ఎన్నికయ్యారు. నూతన మహిళా విభాగంలో అధ్యక్షురాలిగా బాణాల శ్రీగౌరీ, ప్రధాన కార్యదర్శిగా సాయం ఉష, ఉపాధ్యక్షులుగా కులగాని శోభ, ఉప్పు సమత, సంయుక్త కార్యదర్శి నిర్మల, ఉప్పు భాగ్యలక్ష్మి, మహాదేవుని సుహాసిని, ఉప్పు లావణ్య, తిక్క కృష్ణవేణి లు  ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గానికి సమన్వయం వహించిన జిల్లా సంఘం సలహాదారులు, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు గుండవరం మిదుమౌళి నూతనంగా ఎన్నికైన ప్రతినిధులను  అభినందించారు. మహాత్మ బసవేశ్వరుని ఆశయాలకు  అనుగుణంగా అందరూ సమన్వయంతో కలిసి పని పనిచేస్తూ, లింగాయత్ సమాజా శ్రేయసుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.