calender_icon.png 22 December, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరిన కొత్త సర్పంచులు

22-12-2025 09:30:45 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గంలోని  బెజ్జూర్, చింతలమానపల్లి, కౌటాల, సిర్పూర్ టి, కాగజ్ నగర్, పెంచికల్ పేట్, దహేగాం మండలాలలోని గ్రామపంచాయతీ  నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు వార్డు సభ్యులు స్పెషల్ ఆఫీసర్స్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం అధికారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను పూలమాలలు వేసి సాల్వతో సత్కరించారు. ప్రజాస్వామ్య పండగలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ, గ్రామపంచాయతీ అభివృద్ధికి పునరంకితమవుతామనీ ప్రకటించారు.

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం తన విధులను భయము, పక్షపాతము లేకుండా, నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా, అందరినీ కలుపుకుని పారదర్శకమైన పాలన అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు,వార్డు సభ్యులు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లోని సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు నూతన ప్రజాప్రతినిధులకు పూలమాలలతో, సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.