calender_icon.png 23 December, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఘనంగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

22-12-2025 10:30:37 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా అందులో భాగంగా దోమకొండ మండలంలోని లింగుపల్లి  గ్రామ పంచాయతీల సర్పంచ్ పట్టం లక్ష్మి , ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామపంచాయతీలో మండల అధికారుల పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.