calender_icon.png 22 December, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలీ

22-12-2025 10:08:35 PM

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

గద్వాల: ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ... 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.

అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరి A జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో నమోదు చేయబడుతుందని తెలిపారు.  గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని మండలాల తహసిల్దార్లతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ మాట్లాడుతూ మ్యాపింగ్ ప్రక్రియపై ఇప్పటికే జిల్లాలోని బిఎల్ఓ లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 45 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. 40% కన్నా తక్కువ మ్యాపింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి అక్కడ ఎస్ఐఆర్ వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డిఓ అలివేలు, ఎన్నికల విభాగం అధికారి కరుణాకర్, వివిధ మండలాల తహసిల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.