22-12-2025 09:24:40 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దండే విఠల్, యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు సామల రాజన్న ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు దండ విట్టల్ యువసేన అధ్యక్షుడు సామల రాజన్న తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 106 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 12 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
24 మందికి ఆపరేషన్ అవసరమని, 17 మందికి లెన్స్ తో కూడిన అద్దాలు అందిస్తామని తెలిపారు. వైద్య పరికరాల ద్వారా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీ వర్ధన్, మాజీ జెడ్పిటిసి పంద్రం పుష్పలత, నాయకులు జగ్గ గౌడ్, రంగు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.