22-12-2025 10:13:59 PM
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల రెండవ విడత ఎన్నికల్లో దేవపూర్ సిమెంట్ కార్మికులకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు దినాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సోమ వారం బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాపూర్ సిమెంట్ కంపెనీ యజమాన్యం ఎలక్షన్ రోజున వేతనంతో కూడిన సెలవు దినాన్ని ప్రకటించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో BSP మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ దాగం శ్రీనివాస్, సామాజిక నాయకులు పెరుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.