calender_icon.png 31 October, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం జిల్లాలో సీపీఎం సీనియర్‌ నేత దారుణ హత్య

31-10-2025 09:42:34 AM

ఖమ్మం జిల్లాలో దారుణం.. సీపీఎం రైతు నేత హత్య

హైదరాబాద్: ఖమ్మం జిల్లా(Khammam District) మధిర నియోజకవర్గంలోని పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు సీపీఎం సీనియర్ నాయకుడు(Senior CPM leader), సీపీఎం రైతు సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ సామినేని రామారావును(Senior CPM leader Samineni Rama Rao) దారుణంగా హత్య చేశారు. శుక్రవారం ఉదయం వాకింగ్ కు వెళ్లిన సమయంలో దుండగులు గొంతు కోసి హతమార్చారు.

ఈ దారుణ ఘటన పాతర్లపాడులో కలకలం రేపింది. రామారావు పాతర్లపాడు మాజీ సర్పంచ్‌గా పనిచేశారు. సామినేని రామారావు హత్యపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarkaస్పందించారు. ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పోలీసులకు హెచ్చరించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఖమ్మం(Khammam ) జిల్లాలో హింసా రాజకీయాలకు తావులేదని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. స్థానికుల సమాచారంతో  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనుక గల ఉద్దేశ్యం ఇంకా నిర్ధారించబడలేదని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.