calender_icon.png 3 December, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ పట్టేస్థార ?

03-12-2025 12:00:00 AM

 నేడు సౌతాఫ్రికాతో రెండో వన్డే

-తుది జట్టు కూర్పుపై సస్పెన్స్

-పంత్, నితీశ్‌లకు ఛాన్సుందా ? 

-సిరీస్ సమంపై సౌతాఫ్రికా ఫోకస్

రాయ్‌పూర్, డిసెంబర్ 2 : టెస్ట్ సిరీస్ ఓటమికి సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ అడుగుదూరంలో నిలిచిం ది. తొలి వన్డే గెలిచిన టీమిండియా ఇప్పుడు రాయ్‌పూర్ వేదికగా రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. రోహిత్, కోహ్లీ సూపర్ ఫామ్ ఇక్కడ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. బౌలర్లు కాస్త గాడిన పడితే సఫారీలకు రెండో వన్డేలో చెక్ పెట్టి సిరీస్‌ను ఖాతాలో వేసుకోవచ్చు.

నిజానికి తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసి నా మిడిలార్డర్ వైఫల్యం మా త్రం ఇబ్బందికరంగా మారింది. కోచ్ గంభీ ర్ ప్రయోగా లు విఫలమవుతూనే ఉన్నాయి. రుతు రాజ్ గైక్వాడ్‌తో పాటు ఐదో స్థా నంలో వాషింగ్టన్ సుందర్ నిరాశపరిచాడు. దీంతో ఇదే కాంబి నేషన్‌ను కొనసాగిస్తారా లేక పంత్‌కు చోటి స్తారేమో చూడాలి. ఇక తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ సూ పర్ బ్యాటింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది.

రోహిత్ హాఫ్ సెంచరీతో మెరిస్తే.. కోహ్లీ మాత్రం దుమ్మురేపాడు. అటు రోహిత్ కూడా ఫామ్ కంటిన్యూ చేయడంతో రెండోవన్డేలోనూ రోకో జోడిపైనే అందరి చూపుంది. కెఎల్ రాహుల్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకోగా.. జడే జా మెరుపులు మెరిపించాడు. అయితే ఓపెనర్ జైశ్వాల్ మాత్రం రెండో వన్డేలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇక భారత్‌కు తిరుగులేనట్టే. మ రోవైపు బౌలింగ్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో ప్రదర్శన లేదు. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చేశారు. 

మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో వన్డేలో విజ యం సౌతాఫ్రికాకు తప్పనిసరి. దీంతో సిరీస్ సమం చేయడమే లక్ష్యంగా సఫారీలు రెడీ అయ్యారు. కెప్టెన్ బవుమా, స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా జట్టులోకి తిరిగి రానున్నారు. గత మ్యాచ్‌లో బవుమా లేకపోవడంతో మార్క్మ్ కెప్టెన్ గా వ్యవ హరించాడు. తొలి వన్డే లో డికాక్, మార్క్మ్,్ర బ్రెవిస్ వైఫల్యం సఫారీల ను దెబ్బతీసింది. అయితే డి జోర్జి, మార్కో యెన్సన్‌తో పాటు కార్బిన్ బోస్చ్ చివరి వరకూ పోరాడడం సౌతాఫ్రికా బ్యాటింగ్ డెప్త్‌ను నిరూపించింది. 

పిచ్ రిపోర్ట్

రాయ్‌పూర్ పిచ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుందని అంచనా వేస్తు న్నారు. దీని ప్రకారం సీమర్లకు, స్పిన్నర్లకు సమానంగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. డే నైట్ కావడంతో మంచు ప్రభావం కూడా కీలకం కాబోతోంది. 

గత రికార్డులు

భారత్, సౌతాఫ్రికా మధ్య ఇప్పటి వరకూ 94 మ్యాచ్ లు జరిగితే 51 సార్లు సఫారీలదే పైచేయిగా నిలిచింది. భా రత్ 40 మ్యాచ్‌లో గెలవగా.. 3 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.

భారత తుది జట్టు (అంచనా)

జైశ్వాల్, రోహిత్ శర్మ, కోహ్లీ, రుతురాజ్/పంత్, కేఎ ల్ రాహుల్(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జడే జా, హర్షిత్ రాణా, కుల్దీ ప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ

సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా)

మార్క్మ్,్ర డికాక్, బవుమా. బ్రీజ్కే, డి జోర్జి, బ్రెవిస్, యెన్సన్, బోస్చ్, కేశవ్ మహరాజ్, బర్గర్, బార్ట్‌మన్ భారీస్కోరు చేసినా తొలి వన్డేలో కొన్ని బలహీనతలు... బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చేయడం..మిడిలార్డర్‌లో బ్యాటర్లు ఫెయిలవడం.. వెరసి సిరీస్‌లో ఆధిక్యం సాధించినా ఈ వీక్‌నెస్‌లపై దృష్టి పెట్టిన టీమిండియా రాయ్‌పూర్ వన్డేకు రెడీ అయింది. రాంఛీలో జోరునే కొనసాగిస్తూ సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు ఉవ్విళ్ళూరుతోంది. మరోసారి రోకో జోడీపైనే అందరి చూపు ఉండగా.. తుది జట్టు కూర్పులో మార్పులు జరిగే అవకాశముంది.