calender_icon.png 3 December, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండీయా ఓటమి..

03-12-2025 10:12:19 PM

రాయ్‌పూర్: ఇండియా, సౌతాఫ్రికా మధ్య రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచులో టీమిండీయా ఓటమి పాలయింది. టీమిండీయా(India)పై నాలుగు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా(South Africa) విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మరో నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే టార్గేట్ ను చేధించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్(110) సెంచరీతో రాణించారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండీయా నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ(102) మరో సెంచరీతో విరుచుకుపడగా.. రుతురాజ్ గైక్వాడ్(105) కేఎల్ రాహుల్ (66), జడేజ(24) పరుగులు చేశారు.

స్కోర్లు: 

ఇండియా: 358/5 (50)

సౌతాఫ్రికా: 359/6 (49.2)