calender_icon.png 2 September, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారులకు అంచనాలు సమర్పించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

02-09-2025 12:17:18 AM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల దెబ్బ తిన్న రహదారులకు సంబంధించి అంచనాలు రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. సోమవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి భారీ వర్షాలు , వరద నష్టాలపై  అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు ఆర్ అండ్ బి రహదారులు మాత్రం దెబ్బతినడం జరిగిందని, అందువల్ల నష్టం అంచనా వివరాలను వెంటనే తయారుచేసి సమర్పించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ  ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాలపై వేగవంతంగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్&బి, పంచాయతీ రాజ్ శాఖలకి చెందిన  రోడ్లు తెగిపోవటం, లోలెవల్ కాజ్ వేలు, కల్వర్ట్ ల డ్యామేజ్, ఇరిగేషన్ కి సంబంధించి మైనర్, మేజర్ ప్రాజేక్ట్ లకి, చెరువు కట్టలకి చేయాల్సిన మరమ్మత్తులు సంబందించిన వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.