calender_icon.png 11 November, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు ఢీకొని ముగ్గురు మృతి

11-08-2024 06:50:41 PM

గౌడవెల్లి: మేడ్చల్ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దురు చిన్నారులు, ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాఘవేంద్రనగర్ కు చెందిన  కృష్ణ కుటుంబంగా గుర్తించారు. మృతుడు రైల్వే లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పల్లలు ఆడుకుంటారనే ఉద్దేశ్యంతో లైన్ మెన్ కృష్ణ డ్యూటీకి వెళ్తూ ఇద్దరు కుమార్తెలను వెంట తీసుకెళ్లారు. పిల్లలు ఆడుకుంటూ పట్టాలకు అటు ఇటు తిరుగుతున్నారు. ఒకసారిగా రైలు ట్రాక్ పైకి రావడంతో కృష్ణ పిల్లలను కాపాడబోయి ఆయన ఇద్దరు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. చిన్నారుల వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.