22-07-2025 12:00:00 AM
పెబ్బేరు జూలై 21 : మండల పరిధిలోని చెలిమిల్ల గ్రామం జంగాల వీధిలో సోమవారం తెల్లవారుజామున వనపర్తి సాగర్ స్నే క్ సొసైటీ బృందం కొండచిలువ ను బంధించారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన పెల్లూరి చెన్నకేశవుడు ఆదివారం రాత్రి భోజనం తర్వాత ఇంటి వరండాలో నిద్రించాడు. దాదాపు 3 నుంచి 4 గంటల మద్యలో కుక్కలు మొరగటం జరిగింది. మెలకువ వచ్చి లేచి చూడగా పక్కన భారీ శబ్దం వినిపించింది.
భయంతో పరిశీలించి, పక్కన ఉన్న వారిని కేకలు వేసి పిలువగా కొండచిలువ గా గుర్తించారు. పక్కనే ఉన్న మల్లేష్ అనే వ్య క్తి వనపర్తి సాగర్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇచ్చారు. తక్షణమే చీర్ల కృష్ణ సాగర్, అతని బృందం సంఘటన స్థలానికి చేరుకొ ని ఇంటి మెట్ల కింద ఉన్న కొండచిలువ ను బంధించారు. 13కిలోల బరువు, 7 అడుగుల పొడవు ఉన్నట్లు గుర్తించారు. కొండ చిలువ ను అటవీ శాఖ అధికారి విజయ్ సమక్షంలో సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలారు.