calender_icon.png 11 October, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన డిగ్రీ ఫీజులను వెంటనే తగ్గించాలి

11-10-2025 12:18:57 AM

  1. ఫీజుల పేరుతో విద్యార్థులను ఆర్థిక ఇబ్బందులకు గురి చెయ్యొద్దు

పీడీఎస్ యుజిల్లా అధ్యక్షులు వి విజయ్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 10, (విజయక్రాంతి):కాకతీయ యూనివర్సిటీ పరిధి లో డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజుల ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని రామచంద్రా డిగ్రీ కాలేజీ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సం దర్భంగా పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు వి విజయ్ మాట్లాడుతూకాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల ఫీజులను అ మాంతం పెంచడం హేయమైన చర్య, పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర, అంతంతమాత్రంగానే సాగుతున్న డిగ్రీ కో ర్సులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రగా పంపించారు.గత ఫీజులతో పోలిస్తే ప్రస్తుతం యూనివర్సిటీ పెంచిన ఫీజులకు భూమికి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు.

దీంతో విద్యార్థులకు ముఖ్యంగా ఆదివాసీ విద్యార్థులకు ఆర్థిక భారం అధికమవుతుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వాలు యూనివర్సిటీలకు ఇవ్వాల్సిన నిధులను తగ్గిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను స మస్యలకు నిలయంగా మార్చడం మూలాన ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వి ద్యార్థులపై ఫీజుల రూపేనా మోపిన భారా న్ని తక్షణమే తగ్గించాలన్నారు.

లేనిపక్షంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్.నరేందర్. లోకేష్. చంటి. లోహిత. నందిని. దీక్షిత. సుబ్బలక్ష్మి. సంతోష్ తదితరులు పాల్గొన్నారు.