calender_icon.png 15 October, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు

15-10-2025 12:50:26 AM

సిద్దిపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఫారాబాయిల్డ్, చింతగింజల మిల్లు, క్రషర్ ల వలన వెలుబడే దుమ్ము, దూళి తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పట్టణంలోని 15 వ వార్డు ఇమాంబాద్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత యాజమాన్యాలకు దుమ్ము రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పినా వినిపించుకోవటం లేదంటూ మంగళవారం వార్డు కౌన్సిలర్ పాతురి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో  రెవెన్యూ డివిజనల్ అధికారి సదానందం, మునిసిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ లకు వినతి పత్రాలు అందచేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట నుండి 15వ వార్డు ఇమాంబాద్ కు వెళ్లే రోడ్డుకు  ఇరువైపులా ఉన్న శ్రీబాలాజి ఇండస్ట్రీస్, చింత గింజలు మిల్లు, కాంక్రీట్ రెడి మిక్స్ నుండి వెలువడే దుమ్ము దూళి, బూడిద విపరితంగా  రావడం వల్ల వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దుమ్ము కళ్ళలో పడి కంటి సమస్యలతో ఆసుపత్రి పాలు అవుతున్నారన్నారు.

ఈ విషయాలను ప్యాక్టరీల యాజయాన్యల దృష్టికి తెసుకెళ్ళినా వారు పట్టించుకోకుండా ఇష్టమొచ్చి నట్లు వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లఘించి వ్యవహరిసిస్తున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకుని  ఇట్టి ఫ్యాక్టరీలు, మిల్లుల పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయిని సంజీవరెడ్డి, ఉప్పెన గౌరీ శంకర్, మార్క వెంకటేష్, మందాపురం వెంకట్ రెడ్డి, పుల్లూరు కుంటయ్య, పుల్లూరు రాజు, నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.