28-11-2025 12:15:30 AM
అబార్షన్ చేసుకోవాలని ఒత్తిళ్లు
ఆరా తీస్తున్న షీ టీం పోలీసులు
నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లిలో ఘటన
నాగర్ కర్నూల్, నవంబర్ 27(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ మైన ఘటన చోటుచేసుకుంది. ఓ కల్లు వ్యాపారి ఇంటర్ చదువుతున్న ఓ బాలికను లోబర్చుకొని పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలుసుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డను ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. అయితే ఈ సంగతి బయట చెబితే ప్రాణం తీస్తానంటూ ఆ కల్లు వ్యాపారి బెదిరించడంతో పాటు రూ.5వేలు ఇస్తా అబార్షన్ చేసుకో లేదంటే ప్రాణం పోతుందంటూ హెచ్చరించినట్లు తెలిసింది.
ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కల్తీ కల్లు వ్యాపారం చేసుకుంటున్న 60 ఏళ్ల వయసు వ్యక్తి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినిపై కన్నేసాడు. పరిచయం పెంచుకొని మాయమాట లతో నమ్మించి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం బయట పడితే జాగ్రత్త అంటూ హెచ్చరించాడు.5వేలు ఇస్తా ఆబార్షన్ చేసుకో అంటూ హైదరాబాద్ తరలిం చినట్లు సమాచారం. సుమారు మూడు వారాలుగా సదురు విద్యార్థిని కాలేజీకి రాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.