calender_icon.png 5 November, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు

05-11-2025 01:37:42 AM

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ శేఖర్ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకుడు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల హీరో ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో చిత్రయూనిట్ మంగళవారం మీడి యా ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమంలో హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. “మా ప్రమోషనల్ కంటెంట్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా మీద బజ్‌ను క్రియేట్ చేసే క్రమంలోనే ట్రైలర్‌ను ఇంత త్వరగా రిలీజ్ చేశాం. డిసెంబర్ 25న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం. మా చిత్రం ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. కచ్చితంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది” అన్నారు. ‘ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. టెక్నికల్‌గా ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుంది.

ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంద’ని దర్శకుడు యుగంధర్ ముని చెప్పారు. హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడు తూ.. “శంబాల’ అద్భుత చిత్రం. ఇందులో గొప్ప పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌కు పదింతలు మిం చి సినిమా ఉంటుంది. ఆదికి ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ వస్తుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.