05-11-2025 01:39:37 AM
ఇప్పుడెందుకు రావడం లేదనిపించింది!
నాగార్జున ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ ‘శివ’ బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. రామ్‌గో పాల్‌వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘శివ’ను 4కే డాల్బీ ఆట్మాస్‌లో నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీరిలీజ్ ట్రైలర్‌ను మంగళవారం లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు నాగార్జున మాట్లాడుతూ.. “ఈ సినిమాని మీ నాన్న, అమ్మ థియేటర్లలో చూసుంటారు. ఇప్పుడు అదే ప్రేమతో మీరు వచ్చారు. రామ్‌గోపాల్‌వర్మ 36 ఏళ్లక్రితం నాతో ఈ సినిమా తీసి నన్ను పెద్ద స్టార్‌ను చేశారు. పొద్దున్నే సినిమా చూశా. ఇప్పుడెందుకు ఇలాంటి సౌండ్ డిజైన్‌తో నేను చేస్తున్న సినిమాలు రావడం లేదనిపించింది. శివ ఈజ్ ఫరెవర్.
మరో 36 ఏళ్ల తర్వాత ఇదే స్టేజీపై, సినిమాను మళ్లీ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా. రాజమౌళికి అన్నట్టు ఆఫ్టర్ శివ బిఫోర్ శివ.. శివ ఎప్పటికీ నిలిచిపోతుంది” అన్నారు. రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ.. “36 ఏళ్ల క్రితం నాగార్జున నాకు విజువల్‌గా, సౌండ్ పరంగా చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడూ అంతే ఫ్రీడమ్ ఇచ్చారు. చిరంజీవి చెప్పినట్టు సినిమా ఉన్నంతవరకు ‘శివ’ చిరంజీవిలా చిరస్మరణీయం” అని చెప్పారు.