22-10-2025 01:10:46 AM
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా వెంచర్ ఒకటి. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీ సిరీస్ గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అనుపమ్‌ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ లాంటి ఉద్ధండులు శక్తిమంతమైన పాత్రల్లో కనిపించనున్న ఈ హై-స్టేక్స్ వార్ డ్రామాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.
దీపావళి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. యుద్ధ వాతావరణంలో మ్యాసీవ్ రైఫిల్స్ ఒంటరి బెటాలియన్‌లాగా నిలబడి ఉన్న ప్రభాస్ సిల్హౌట్ అదిరిపోయింది. మహాభారతంలోని అర్జునుడిని గుర్తుచేస్తూ ‘అతను పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు’ అని పోస్టర్‌పై రాసి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘డీక్రిప్షన్ బిగిన్స్ ఆన్ అక్టోబర్ 22’ అనే వ్యాఖ్యను జోడించటం ద్వారా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేలా చేసింది చిత్రబందం. అంటే, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కంటే ఒకరోజు ముందే ఒక సిగ్నిఫికెంట్ రివీల్ ఉండబోతోందన్న మాట! ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ ఐఎస్‌సీ; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; సాహిత్యం: కృష్ణకాంత్; ప్రొడక్షన్ డిజైన్: అనిల్ విలాస్ జాదవ్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.