03-11-2025 02:34:57 AM
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆయన ఈ మూవీ సెట్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వీటీవీ గణేశ్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కీలక చిత్రీకరణ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.
చిరంజీవి, ఫైటర్స్ టీమ్ పాల్గొనే స్టైలిష్ క్లుమైక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను ఆదివారం ప్రారంభించారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో ప్రతి సన్నివేశం రూపొందుతోంది. చిరంజీవి చరిష్మా, గ్రేస్, అనిల్ రావిపూడి టచ్ కలిసిన ఈ క్లుమైక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుందని టీమ్ చెబుతోంది. 2026 సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: సమీర్‌రెడ్డి; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.