calender_icon.png 3 November, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రేమంటే’.. కొత్త జంట గిల్లికజ్జాల సమాహారం!

02-11-2025 10:29:54 PM

ప్రియదర్శి నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా, సుమ కనకాల ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, జాన్వీ నారంగ్ నిర్మాతలు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ ఆదివారం లాంచ్ చేశారు.  

టీజర్‌లో కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపు హిలేరియస్‌గా చూపించారు. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్నచిన్న సమస్యలతో ఎలా మలుపులు తిరుగుతుందో ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశారు. ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలను అలరించేలా చూపించారు. మొత్తంగా ప్రియదర్శి, ఆనంది మధ్య కెమిస్ట్రీ సహజంగా, చూడముచ్చటగా ఉంది. సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇవ్వడంతో కథలో కొత్త మలుపు వస్తుంది. ఆమె పాత్ర హ్యూమర్‌ని మరింత ఎలివేట్ చేసింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ కట్టిపడేసింది. వెన్నెల కిషోర్ తన సిగ్నేచర్ టచ్‌తో నవ్వులు పంచారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్‌రెడ్డి; సంగీతం: లియాన్ జేమ్స్; డైలాగ్స్: కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్; ఎడిటర్: రాఘవేంద్ర తిరున్; ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ మూలే.