22-08-2025 02:11:15 AM
అమీర్‌పేట్, మైత్రివనం ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యటన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): అమీర్‌పేట్, మైత్రివనం ఏరి యాలు ముంపునకు గురికాకుండా చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్‌ఎంసీ, హైడ్రా సంయు క్తంగా సమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు జీహెచ్‌ఎంసీ, హైడ్రా వేర్వేరుగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. వరద ముంపు సమస్యలు ఉత్పన్నం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించా రు.
తాజాగా గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంయుక్తంగా జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్, సాంకేతిక కన్సల్టెంట్‌లతో కలసి అమీర్‌పేట్, మైత్రివనం ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వరద కాలువలకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. అమీర్‌పేట మెట్రోస్టేషన్, మైత్రివనం దగ్గర వరద ఉధృతిని శాశ్వతంగా కట్టడి చేయడానికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జూబ్లీహిల్స్, వెంకటగిరి, రహ్మత్ నగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల నుంచి కృష్ణ కాంత్ పార్క్ మీదుగా పారే కాలువ, గాయత్రి నగర్ వద్ద ఉన్న నాలాలో కలుస్తోంది. ఈ ప్రాంతాలతో పాటు ఇటీవలే మధురానగర్, శ్రీనివాస్‌నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డు మొత్తం మునిగిపోయింది. అమీర్‌పేట మెట్రో, మైత్రివనం ప్రాంతం వరద నీటితో నిండిపోయింది.