calender_icon.png 21 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ రేసర్‌గా శర్వా

21-09-2025 01:11:37 AM

స్టార్ హీరో శర్వానంద్ ఇప్పుడు తన 36వ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందు లో ఆయన స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా కనిపించబోతున్నా రు. అభిలాష్ కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోం ది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ మూవీ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి జే యువ రాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూ, ఎక్సయిటింగ్ విజువల్స్‌ని అందిస్తున్నా రు. గిబ్రాన్ ఈ చిత్రానికి డైనమిక్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేస్తున్నారు. అనిల్‌కుమార్ పీ ఎడిటర్‌గా, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.