21-09-2025 01:10:32 AM
త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. సాహితీ అవాంఛ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఇట్లు మీ ఎదవ’అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్‌లైన్. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను శనివారం లాంచ్ చేశారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్; డీవోపీ: జగదీష్ చీకటి.