11-07-2025 12:04:58 AM
తిరువనంతపురం, జూలై 10: వచ్చే ఏడాది కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీ ఎఫ్) తరఫున ముఖ్యమంత్రి రేసులో కాం గ్రెస్ ఎంపీ శశిథరూర్ అగ్ర స్థానంలో నిలిచారు. స్వతంత్ర సంస్థ ఓట్ వైబ్ నిర్వహిం చిన సర్వేలో యూడీఎఫ్ సీఎం అభ్యర్థిగా శశిథరూర్‌ను 28.3 శాతం మంది ఇష్టపడు తున్నట్టు సర్వేలో తేలింది. ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కేవలం 17.5 శాతం మంది మాత్రమే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని పేర్కొంది.
అయితే విచిత్రంగా కొవిడ్ మహమ్మారిపై తీవ్ర పోరాటం చేసిన మాజీ ఆరో గ్య శాఖ మంత్రి కేకే శైలజ 24.2 శాతం ఓట్ల తో ఎల్డీఎఫ్ తరఫున అగ్రస్థానంలో నిలవ డం విశేషం. సర్వేలో ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వో ట్ వైబ్ పేర్కొంది. ఇక కేరళలో వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా యి. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధి కారంలోకి రాకుండా ఆపాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భావిస్తోంది.
సర్వే ప్రకారం యూడీఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా థరూర్‌కు 30 శాతం మంది పురుషు లు, 27 శాతం మంది మహిళలు మద్దతు ఇచ్చారు. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయనకు 55 ఏళ్ల పైబడిన వారిలో 34.2 శాతం మంది మద్ద తు ఇవ్వడం విశేషం.
సర్వే ప్రకారం 18 సంవత్సరాల వయస్సు గల వారిలో శశిథరూర్‌కు 20.3 శాతం మద్దతు ఉండటం విశే షం. కాగా సర్వే వివరాలను ఈడీ మాథ్యూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చే యడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘ధన్యవాదాలు’ అన్న ఎమోజీతో రీట్వీట్ చేశారు.
సన్నీ జోసెఫ్ వర్సెస్ శశిథరూర్..
అయితే కొంతకాలంగా ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కేరళలోని నీలంబూర్‌లో ఉప ఎన్నిక కోసం నిర్వహించిన ప్రచారంలో శశిథరూర్ పాల్గొనలేదు. ప్రచారం చేయడానికి తనను కాంగ్రెస్ పిలవలేదని శశిథరూర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కేరళ కాంగ్రెస్ చీఫ్ సన్నీ జోసెఫ్ స్పందించారు. నీలంబూర్ బైపోల్‌లో స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో శశిథరూర్ పేరు కూడా ఉందని స్పష్టం చేశారు.
ఆయన కేరళకు వచ్చింది కూడా తనకు తెలియదని పేర్కొనడం వివాదాస్పదమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం రేసులో సన్నీ జోసెఫ్ వర్సెస్ శశిథరూర్‌గా మారే అవకాశముంది. అంతేకాదు ఇటీవల కేంద్ర ప్ర భు త్వ విధానాలను మె చ్చుకుంటూ వస్తోన్న శ శిథరూర్‌పై కాంగ్రెస్ హైకమాండ్ కాస్త గు ర్రుగానే ఉంది.
ఈ ఏడాది కేరళ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని శశిథరూర్ ప్ర శంసించడం కాంగ్రెస్‌తో సంబంధాలను దె బ్బ తీసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో శశిథరూర్‌ను కాదని ప్రస్తుత ఏఐసీసీ ప్రధాన కా ర్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కేరళ నుంచి ముఖ్యమంత్రి అ భ్యర్థి రేసులో నిలిపే యోచనలో హైకమాండ్ ఉంది. ఇదే నిజమైతే తె లంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేణుగోపాల్‌కు పూర్తి మ ద్దతు లభించే అవకాశ ము ంది. కేరళ సీఎంగా వేణుగోపాల్ ఎన్నికైతే ఏఐసీసీ సెక్రటరీగా పనిచేసి ముఖ్యమంత్రి అయిన తొలి సౌత్ ఇండియన్‌గా నిలవనున్నారు.