11-07-2025 12:03:11 AM
వాషింగ్టన్, జూలై 10: ఉక్రెయిన్‌తో యు ద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ విషయంలో తన మాటను లెక్క చేయకపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు ఉక్రె యిన్‌తో యుద్ధం గురించి పుతిన్‌తో చర్చలు జరిపారు.
మాటల సందర్భంలో చాలా సా ర్లు ట్రంప్ ఉక్రెయిన్ ప్రస్తావన తెచ్చారు. పు తిన్ దానిపై మాట్లాడటానికి ఆసక్తి చూపలే దు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో వెన క్కి తగ్గని పుతిన్.. శాంతి ఒప్పందానికి కూడా ముందుకు రాకపోవడంతో తాజాగా వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాతో పెద్ద ఎత్తు న వ్యాపారం చేస్తున్న భారత్, చైనా సహా ఇతర దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలతో భారత్‌కు ఇ బ్బందులు తప్పవని తెలుస్తోంది. రష్యా నుం చి భారత్ భారీగా చమురు, శిలజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటుంది. మే 2025 నాటికి రోజుకు 1.96 మిలియన్ బ్యారెళ్ల ర ష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుం ది. ఇక ఇటీవల బ్రిక్స్ కూటమికి మద్దతిచ్చే దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అమెరికా విధానాలకు వ్యతిరేకించే విధంగా బ్రిక్స్ కూటమి వ్యవహరిస్తోందని.. అందుకే ఆ కూటమికి మద్దతిచ్చే దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామని తెలిపారు. ఇక సుంకాల విషయంలో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఇప్పటివరకు 20 దేశాలపై కొత్తగా భారీ సుంకాలను ప్రకటించారు. ఈ నిర్ణయాలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
తాజా టారిఫ్‌లలో అత్యధికంగా బ్రెజిల్‌పై 50 శాతం సుంకం విధించగా.. ఇరాక్, అల్జీరియా, లిబియా, శ్రీలంకపై 30 శాతం, బ్రూ నై, మోల్డోవాపై 25 శాతం, దక్షిణ కొరియా, జపాన్‌లపై కూడా 25 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే.