calender_icon.png 10 November, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రక్షణ కోసమే షీ టీంలు

10-11-2025 05:11:07 PM

మందమర్రి (విజయక్రాంతి): మహిళల రక్షణ కోసమే షీ టీం నిరంతరం పని చేస్తుందని షీ టీం సభ్యులు శ్రావణ్, జ్యోతి, దివ్యలు తెలిపారు. మండలంలోని అందుగుల పేట సింగరేణి మహిళా జూనియర్, డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యార్థులకు, షి టీమ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్ లపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. మహిళల, విద్యార్థుల భద్రత కు షీ టీం ప్రధమ ప్రాధాన్యత నిస్తుందన్నారు. దీనిలో భాగం గా ప్రతి రోజు బస్టాండ్, ముఖ్య కూడళ్లలో, జన సమర్థత గల ప్రాంతాల్లో, కాలేజీల వద్ద షీ టీం నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే మహిళలు విద్యార్థులు ధైర్యంగా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు.

ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశ కు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్స్ ల బారిన పడుతున్నారని, వాటికి జోలికి పోకుండా ఉండాలని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమం కాలేజీ ప్రిన్సిపాల్ చందు యాదవ్, అధ్యాపకులు రాజేశం, సురేష్, రాజకుమార్, గంగ లక్ష్మి విద్యార్థినులు పాల్గొన్నారు.