20-07-2025 12:00:00 AM
ఏడు గంటల సిట్ విచారణ అనంతరం అదుపులోకి
విజయవాడ, జూలై 19: ఏపీ మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయన్ను సిట్ శనివారం అదుపులోకి తీసుకుంది. విజయవాడలోని సిట్ కార్యాల యంలో సుమారు 7 గంటల పాటు విచారించిన అనంతరం ఎంపీని అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరా తదితర అంశాలపై మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది.
ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారనే దానిపై ఆరా తీసింది. డొల్ల కంపెనీల నుంచి సొమ్ముఉ అంతిమ లబ్ధిదారుకి చేర్చిన విధానంపై సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు ,సరఫరా వ్యవస్థను మాన్యువల్‌కు మా ర్చడంలో మిథున్‌రెడ్డిదే కీలకపాత్ర. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే.