calender_icon.png 25 January, 2026 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరిమలలో షూటింగ్ వివాదం

25-01-2026 12:06:38 AM

దర్శకుడి విచారణకు టీడీబీ ఆదేశం

త్రివేండ్రం, జనవరి ౨౪: శబరిమలలోని అయ్యప్ప ఆలయ సన్నిధానంలో ఈనెల ౧౪వ తేదీ సాయంత్రం మకర జ్యోతి వెలుగుతున్న వేళ మలయాళ దర్శకుడు అనురాజ్ మనోహర్ ఓ సినిమా చిత్రీకరణకు పూనుకున్నాడనే వచ్చిన ఆరోపణలపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) స్పందించింది. అనురాజ్ వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టీడీబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపడుతున్నది.

విచారణలో చిత్ర యూనిట్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీడీబీ ప్రకటించింది. ఈ అంశంపై దర్శకుడు అనురాజ్ స్పందిస్తూ.. తాను ఎలాంటి సినిమా చిత్రీకరణ చేయలేదని చెప్తున్నారు. తన తదుపరి చిత్రంలో శబరి మల సెట్ వేయనున్నామని, కేవలం రిఫరెన్స్ కోసమే తాను ఐఫోన్‌లో కొన్ని ఫొటోలు తీశానని తెలిపారు. తన సెట్ సహజసిద్ధంగా ఉండాలనే కోరికతోనే ఆ ఫొటోలు తీశానని చెప్తున్నారు.