29-09-2025 10:25:04 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ రాంనగర్ సెంటర్లో మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఏమేమి పువ్వుపోనే గౌరమ్మ, ఏమేమి కయోప్పునే గౌరమ్మ, అనే పాటలతో తీరొక్క పువ్వులు తెచ్చి బతుకమ్మను చేసి రాంనగర్ కూడలిలో గౌరమ్మను కొలిచారు. అనంతరం మార్తనేని జయంతి ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో అన్ని దేవదేవతలకు పూలతో పూజిస్తామని, ఒక బతకమ్మకు మాత్రమే పూలనే దైవంగా భావిస్తూ పూజిస్తామని అన్నారు. ప్రతి ఏడా భక్తిశ్రద్ధలతో 9 రోజులు బతుకమ్మని పూజిస్తూ 9వ రోజు నిమజ్జనం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భారతి,నాగమణి, శ్రియా రెడ్డి, అనిత, ఉమా, కంది సరళ తదితరులు పాల్గొన్నారు.