16-05-2025 12:28:58 AM
రక్తదానంతో మానవత్వాన్ని చాటుకున్న రవి
కామారెడ్డి, మే 15 (విజయ క్రాంతి): సకాలంలో ప్లేట్లెట్లు అందించడం వల్ల ఒకరి ప్రాణాన్ని రక్షించిన రవి అనే యువకుడు తన మానవత్వాన్ని చాటుకున్నాడని ఐవిఎఫ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు చెందిన రవి 37 వ సారి పాముకాటు బాధితుడికి సకాలంలో ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అందజేసి మానవత్వాన్ని చాటడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవి ప్రతి సంవత్సరం 4 సార్లు రక్తదానం చేయడంతో పాటుగా,ప్లేట్ లెట్స్ అవసరం అయినా కూడా బాధితులకు అందజేస్తూ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని అన్నారు.రక్తదాత రవి ని స్పూర్తి గా తీసుకొని యువత రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు.