22-11-2025 09:44:10 PM
మోతే (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి శనివారం ప్రకటించారు. మోతె మండలం లాల్ తండాకు చెందిన బాణోతు శ్రీను నాయక్ ను జిల్లా కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తాను చేసిన కృషిని గుర్తించి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి తనను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మోతె మండలంతో పాటు జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గ్రామీణ స్థాయిలో ప్రజలకు చేరేలా పని చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.