calender_icon.png 29 July, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు రజతం

06-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: ఆసియా యూత్ ఆర్చరీ పోటీల్లో భారత జట్టు మహిళల విభాగంలో రజతం కైవసం చే సుకుంది. మహిళల రికర్వ్ అండ ర్-18 పోటీల్లో భారత్ టీం ఈవెంట్‌లో రజతం సాధించి సత్తా చాటిం ది. వైష్ణవి, ప్రంజల్ తోలియ, జన్నత్‌లతో కూడిన భారత్ బృందం సౌత్ కొరియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో షూట్ ఆఫ్‌లో నెగ్గింది. మెడల్ రౌండ్‌లో మాత్రం వెనుకబడి రెండో స్థానంతో సరిపెట్టుకో వాల్సి వచ్చింది. చైనీస్ తైపీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా షూట్ ఆఫ్‌కు దారి తీసినప్పటికీ భారత ఆర్చర్లు 2-4 తేడాతో పరాజయం పాలయ్యారు.