calender_icon.png 15 September, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్బండ వర్గాలను కలిపేదే బతుకమ్మ

15-09-2025 01:03:50 AM

  1. ఆ పండుగ కొందరికే పరిమితమైంది కాదు
  2. ప్రజా గాయకురాలు విమలక్క
  3. బహుజన బతుకమ్మ పాటను ఆవిష్కరించిన అతిథులు   

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ‘ప్రకృతి రక్షణే- ప్రజల రక్షణంటూ‘ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్)  రూపొందించిన బహుజన బతుకమ్మ- 2025 పాటను ఆదివారం హైదరాబాద్ నగరంలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఓ కార్య క్రమంలో ఘనంగా ఆవిష్కరించారు. ప్రజా గాయకురాలు విమలక్క అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్రాంతి హైదరాబాద్ హైకోర్టు జస్టిస్ రాధా రాణి ముఖ్య అతిథిగా  హాజరు కాగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల తదితరులు పాల్గొన్నారు.

ప్రజా గాయకురాలు విమలక్క మాట్లాడుతూ బతుకమ్మ పండుగ కొందరికే పరిమితమైంది కాదని, సబ్బండ ప్రజలను కలిపే ప్రయత్నం చేస్తుందని అన్నారు. నేడు ప్రకృతి విధ్వంసాలు ఎక్కడ జరిగినా వాటికి కారణం మానవ తప్పిదాలేనన్నారు. ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల్‌రావు మాట్లాడుతూ 15 సంవత్సరాల బహుజన కార్యక్రమాలను ప్రశంసించారు.

ఏకే ప్రభాకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వచ్చిన బతుకమ్మ పాటపై విశ్లేషిస్తూ సాంప్రదాయిక పదాలను తెరదించి శ్రమజీవుల పదజాలాన్ని పలకించిన విషయాన్ని గుర్తు చేశారు.విశ్రాంత ఆచార్యులు కే.లక్ష్మీ బహుజన బతుకమ్మ గురించి వివరించారు.రాజేంద్రప్రసాద్ జీవిత సహచరి యాలవర్తి ధనలక్ష్మి పాటను ఆవిష్క రించారు.

బహుజన బతుకమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మి బహుజన బతుకమ్మ ఏర్పాటును, దాని ఉద్యమ కార్యచర ణను 15 సంవత్సరాలుగా ఎత్తి పడుతున్న ఉద్యమ నినాదాలను గురించి వివరించారు. కార్యక్రమానికి ముందు అమరులకు జోహా ర్లు తెలుపుతూ సభ మౌనం పాటించింది.

ఈ కార్యక్రమంలో మాదాల రవి, అంబటి నాగన్న, తొలివెలుగు రఘు, జ్యోత్స్న, భద్ర, రఫీ,  పీడీఎస్‌యూ పూర్వ నాయకుడు శీను, సోగరా భేగం, నాగిరెడ్డి, రఘునందన్, మల్లే ష్, కస్తూరి శ్రీను, యాదగిరి, సైర్వ భాను, అనంతడుపుల నాగరాజు,  దుచ్చర్ల సత్యనారాయణ, భరత్, పృధ్వీరాజ్ ,పాశం యాద గిరి, డాక్టర్ సి అనిత కుమారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అరుణోదయ బృంద ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.