calender_icon.png 14 September, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడవటంచ ను దర్శించుకున్న సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం, ఎమ్మెల్యే జీఎస్సార్

14-09-2025 06:05:13 PM

రేగొండ,(విజయక్రాంతి): మండలంలోని కొడవటంచ గ్రామంలోని భక్తులు కోరిన కోరికలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం సింగరేణి సి అండ్ ఎండి బలరాం, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించుకున్నారు. ముందుగా  బాలాలయంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న గర్భగుడి పునరుద్ధరణ పనులు,ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి సి అండ్ బలరాం మీడియాతో మాట్లాడుతూ.. మొదటిసారి కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఆలయ అభివృద్ధి పనులకు సింగరేణి సీఎస్ఆర్ నిధులు కావాలని ఎమ్మెల్యే కోరారని, అట్టి నిధులు త్వరలోనే ఇస్తామని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు, అందులో భాగంగా కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునరుద్ధరణ అభివృద్ధి పనులకు రూ.12 కోట్లతో వివిధ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వాటి అన్ని పనులు కూడా రెండు మూడు నెలల్లో పూర్తి అయితే ఆలయ పునః ప్రారంభ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు.