calender_icon.png 14 September, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతింటి కళ సాకారం అయ్యేవరకు ఉద్యమిస్తాం

14-09-2025 07:29:15 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి కార్మికుల సొంతింటి కళ సాకారం అయ్యేవరకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పోరాటాలు  ఉదృతం చేస్తామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 11, 12 వ తేదీల్లో సొంతింటి కళ సాకారం కోసం కార్మికుల అభిప్రాయ సేకరణ లో భాగంగా నిర్వహించిన పోలింగ్ పత్రాలను ఆదివారం పట్టణ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమక్షంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కార్మికుల అభిప్రాయ  సేకరణలో బాగంగా చేపట్టిన పోలింగ్ కు సింగరేణి యాజమాన్యం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినప్పటికీ అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఏరియాలో నిర్వహించిన పోలింగ్ లో 2250 మంది కార్మికులు సొంతింటి కోసం, 133 మంది సింగరేణి క్వార్టర్ కావాలని, ముగ్గురు కార్మికులు రెండు కావాలని ఓటు వేశారని, ఏరియాలో 70 శాతం పోలింగ్ జరిగిందని, కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేశారని వారికి విప్లవాభి నందనలు తెలిపారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా కార్మికుల సమస్యలు స్ట్రక్చర్డ్ సమావేశాల ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత యజమాన్యం నిర్వహిస్తున్న స్ట్రక్చర్డ్  సమావేశాల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించా ల్సింది పోయి సమావేశాలను బహిష్కరించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 

కార్మికులకు 35% లాభాల వాట సొంతింటి కళ వంటి ప్రధాన డిమాండ్లను స్ట్రక్చర్ సమావేశాల్లో పరిష్కరిస్తారని ఆశించిన కార్మిక వర్గానికి తీవ్ర నిరాశే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు పూర్తయినప్పటికీ నేటి వరకు కార్మికులకు లాభాల వాటా ప్రకటించలేదని మరో 15 రోజుల్లో దసరా పండుగ ఉన్నప్పటికీ గతంలో దసరా సందర్భంగా కార్మికుల లాభాల వాటా ఇచ్చే ఆనవాయితీ ఉండేదని ఈ స్ట్రక్చర్ సమావేశాల్లో దసరా పండుగకు ముందు కార్మికులకు లాభాల వాట ప్రకటించి చెల్లింపు తేదీని ప్రకటిస్తారని కార్మికులు ఆశగా ఎదురు చూస్తే వారి ఆశలపై గుర్తింపు సంఘం నీళ్లు చల్లిందని ఆయన మండిపడ్డారు. గుర్తింపు సంఘంగా కార్మికుల సమస్యలను పరిష్కరించా ల్సింది పోయి యాజమాన్యం తో కలసి నాటకాలు ఆడు తుందని తీవ్రంగా విరుచుకు పడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారం గుర్తింపు సంఘంతో సాధ్యం కాదని  స్పష్టమైంద న్నారు.

సమస్యల పరిష్కారం పై గుర్తింపు సంఘానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు  నిర్వహిస్తామని గతంలో ప్రకటించిందని దీనికి కట్టుబడి ఉండి అన్ని సంఘాలలో సమావేశానికి  తేదీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన బొగ్గు బ్లాక్ ల కేటాయింపు కోసం సింగరేణి సంస్థ టెండర్లు వేయాలని చెప్పిన ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలపై స్పందించక పోవడం సరైంది కాదన్నారు. దసరా పండుగకు 15 రోజులు ఉన్నందున సంస్థ సాధించిన వాస్తవ లాభాలను యాజ మాన్యం ప్రకటించి లాభాల వాటాను వెంటనే చెల్లించాలని,  సింగరేణికి రావలసిన ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని, మారు పేర్లు సవరించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న సింగరేణి వ్యాప్తంగా జిఎం ఆఫీసుల ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.