14-09-2025 06:09:59 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కన్నతల్లిని హత్య చేసిన కుమారుడి ని, అత్యధిక సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మహిళ హత్య కేసును పిట్లం పోలీస్ లు చేదించినట్లు తెలిపారు. ఈనెల 11న పిట్లం మండలం గొల్లపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని 70 సంవత్సరాల మహిళ శవం లభించింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగుల శివాజీ ఫిర్యాదు మేరకు పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మహిళా శవం ఫోటోలను సీసీ కెమెరా ఫుటేజ్ సేకరించి వాట్సప్ గ్రూపులు సోషల్ మీడియాలో షేర్ చేసి సమాచారాన్ని అందరికీ చేరేలా చేశారు. ఈనెల 12న బొల్లం గ్రామ పెద్దలు ఓ వ్యక్తిని నువ్వు ఎర్రోళ్ల బాలా ఇద్దరు కలిసి సాయన్న ఆస్పత్రికి తీసుకెళ్లినారు కదా ఏమైంది అని అడగగా అతను గ్రామ పెద్దలకు హత్య చేసిన వివరాలను వెల్లడించారు. ఎర్రోళ్ల బాలయ్య తన తల్లి సాయవ్వ ఆరోగ్యం బాగాలేదని ఇంట్లోనే పడుకున్న దగ్గర మలమూత్ర విసర్జన ఇంట్లో చూసుకోవడానికి వాళ్ళు లేరని ఇల్లు వాసన వస్తుంది అని చెప్పి ఈనెల 8:30 రాత్రి 9:00 సమయంలో తన బైక్ వై బొల్లకుపల్లి బ్రిడ్జి వద్ద కు తీసుకెళ్లి బ్రిడ్జి మీద నుంచి మందిరం నదిలోకి తోసివేసి హత్య చేసినట్లు తెలిపారు.
ఆదివారం పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు బాన్సువాడ మండలంలోని కొయ్య గుట్ట చౌరస్తా వద్ద నిందితుడు ఎర్రోళ్ల బాలయ్య, మరొకరు బలరం నుండి కొయ్య గుట్టకు వస్తున్నారు అరెస్టు చేసి హత్యలో ఉపయోగించిన బైకు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తల్లిని హత్య చేసిన ఎర్రోళ్ల బాలయ్యను రిమైండర్ తరలించగా మరొకరిని జూలై బాలుడు అబ్జర్వేషన్ హోముకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ హత్య కేసు చేదించిన బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్స్వాడ రూరల్ తిరుపతయ్య పిట్ల మెసేజ్ వెంకట్రావు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.