calender_icon.png 14 September, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది

14-09-2025 07:17:12 PM

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్

హుజూర్ నగర్: తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాట యోధులు చూపించిన ధైర్యం,నిబద్దత, త్యాగనిరతి ప్రజలందరికీ ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్తూపానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నైజాం నవాబుల నిరంకుశ పాలన, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశ చరిత్రలోనే గొప్ప పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. 1946 నుండి 1951 వరకు సాయుధ పోరాటంలో ఎందరో కమ్యూనిస్టులు అమరులయ్యారు అన్నారు.వారి ప్రాణాల త్యాగాలతోనే నేడు ప్రజలు స్వేచ్ఛ సమానత్వాన్ని అనుభవిస్తున్నారు. వారిని స్మరించుకోవడం నివాళులర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.