14-09-2025 07:25:57 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూలు 80 కోట్ల బీఏస్ పథకం నిధులతో పాటు, ఈ ఏడాది రూలు 130 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ అని అన్నారు. ఆదివారం రోజున కరీంనగర్ పట్టణంలో స్థానిక పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ పాల్గొన్ని మాట్లాడుతూ... రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి నిధులతో పాటు, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షీప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ప్రవేట్ స్కూళ్లలో విద్య కోసం నిర్వహిస్తుండగా ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం 25,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారాని, ఇందులో 18,000 మంది ఎస్సీ కేటగిరీకి, 7,000 మంది ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారని సమాచారం ఉంది. ఈ పథకం కింద చదువుకుంటున్న విద్యార్థులందరూ నిరుపేద ప్రజలకు సంబంధించిన విద్యార్థులు ఎంతోమంది పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చే ఈ పథకాన్ని కొనసాగించాలని కోరారు.