calender_icon.png 14 September, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్స్ గ్రేషియా రూ.25 లక్షలు పెంపునకు నిర్ణయం: జేబీసీసీఐ సభ్యులు లక్ష్మారెడ్డి

14-09-2025 07:20:37 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): దేశ వ్యాప్త బొగ్గు గనుల ప్రమాదాల్లో బాధితులకు అందజేసే ఎక్స్ గ్రేసియాను రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్, జేబీసీసీఐ సభ్యులు కొత్తకాపు లక్ష్మారెడ్డి వెల్లడించారు. బీఎంఎస్ అవిశ్రాంతమైన పోరాట ఫలితంగానే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా పెంచినందుకు బీఎంఎస్ హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. సింగరేణిలో కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఉద్యోగికి ఉచితంగా కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని కోల్ ఇండియాలో అమలు చేయించడం కూడా అఖిల భారతీయ ఖధాన్ మజ్దూర్ సంఘ్ (ఏబీకేఎంఎస్ ) చేసిన దీర్ఘకాలిక పోరాట ఫలితమేనని బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలిపారు.

బొగ్గు తవ్వకం సహజంగానే ప్రమాదకరమైందని, బొగ్గు ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెరుగుతున్న కొద్దీ కార్మికులలో ఆందోళన, ఒత్తిడి మరింతగా పెరుగుతున్నాయన్నారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా సమగ్ర స్వల్పకాలిక, దీర్ఘకాలిక భద్రతా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. గనులలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సరైన మద్దతు అందించడానికి ప్రస్తుతం ఉన్న ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని రూ. 15 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.