calender_icon.png 26 January, 2026 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యంపేట గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 06:13:39 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తి వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, భారత రాజ్యాంగ విలువలకు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆశా బోయిన అక్షరా శ్రీనివాస్, ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, గ్రామ పాలకవర్గ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. అలాగే గ్రామ సెక్రటరీ అంజయ్య, మాజీ చైర్మన్ రమణారెడ్డి హాజరై వేడుకలకు విశేషంగా తోడ్పడ్డారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.